జగన్ అక్రమాస్తుల కేసు నుంచి తప్పించాలంటూ విశ్రాంత అధికారి రాజగోపాల్ పిటిషన్‌.. సుప్రీంకోర్టులో విచారణ

07-01-2020 Tue 12:38
  • ఓబులాపురం మైనింగ్ కేసుల నుంచి కూడా తప్పించాలని వినతి 
  • కౌంటర్ దాఖలు చేసేందుకు నాలుగు వారాల గడువు కోరిన సీబీఐ
  • గతంలో ఏపీ గనుల శాఖ డైరెక్టర్‌గా పనిచేసిన రాజగోపాల్

జగన్ అక్రమాస్తుల కేసు, ఓబులాపురం మైనింగ్ కేసు నుంచి తనను తప్పించాలంటూ విశ్రాంత అధికారి వీడీ రాజగోపాల్ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. గతంలో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) అధికారులు నాలుగు వారాల గడువు కోరారు. దీంతో వారు అడిగిన గడువును న్యాయమూర్తి జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ ఇచ్చారు. ఓఎంసీ అక్రమాల సమయంలో ఏపీ గనుల శాఖ డైరెక్టర్‌గా రాజగోపాల్ పనిచేశారు. జగన్ అక్రమాస్తుల కేసు, ఓబులాపురం మైనింగ్ కేసుల్లో ఆయన పేరు కూడా ఉంది.