కొత్తగా తయారయ్యే ఏసీ మెషీన్లపై ఆంక్షలు... 24 డిగ్రీల వద్దే పని మొదలు!

07-01-2020 Tue 12:26
  • తాజా ప్రమాణాల ప్రకటన
  • అన్ని స్టార్ రేటింగ్ లకూ వర్తింపు
  • ఇప్పటికే అమలులోకి నిబంధన

ఇకపై ఏసీ మెషీన్లలో 24 డిగ్రీల ఉష్ణోగ్రత సూచిక డీఫాల్ట్ గా ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. బీఈఈ (ఇంధన సమర్థత మండలి) ఈ మేరకు తాజా ప్రమాణాలను ప్రకటించిందని విద్యుత్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇళ్లల్లో ఏసీ స్విచ్ ఆన్ చేసిన తరువాత, 24 డిగ్రీల వద్ద ఉష్ణోగ్రత ఉంటేనే అది పని చేయడం ప్రారంభించాలని, విక్రయించే అన్ని స్టార్ గుర్తులకూ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ నిబంధన ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చినట్టని పేర్కొంది.