రాజధాని హైపవర్ కమిటీకి లేఖ రాసిన రాయలసీమ నేతలు

07-01-2020 Tue 12:13
  • లేఖపై సంతకాలు చేసిన గంగుల ప్రతాప్‌రెడ్డి, మైసూరారెడ్డి, శైలజానాథ్‌
  • రాజధానిపై కమిటీల సిఫార్సులు సీఎం ఆలోచనకు తగ్గట్లే ఉన్నాయి
  • మా ప్రాంత వాసులు తెలుగు జాతి కోసం ఎన్నో త్యాగాలు చేశారు
  • గ్రేటర్ రాయలసీమలో రాజధానిని పునరుద్ధరించాలి

రాజధాని హైపవర్ కమిటీకి ఈ రోజు రాయలసీమ నేతలు ఓ లేఖ రాసి తమ అభిప్రాయాలను తెలిపారు. ఆ లేఖపై  గంగుల ప్రతాప్‌రెడ్డి, మైసూరారెడ్డి, శైలజానాథ్‌, చెంగారెడ్డి సంతకాలు చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కమిటీలు ఇచ్చిన నివేదికలు సీఎం జగన్ ఆలోచనకు తగ్గట్లే ఉన్నాయని వారు అందులో పేర్కొన్నారు.

రాయలసీమ ప్రాంత వాసులు తెలుగు జాతి కోసం ఎన్నో త్యాగాలు చేశారని రాయలసీమ నేతలు లేఖలో తెలిపారు. తమ త్యాగాలు, మనోభావాలు జీఎన్ రావు, బోస్టన్ కమిటీ ప్రతినిధులకు తెలియవని వారు అన్నారు. గ్రేటర్ రాయలసీమలో రాజధానిని పునరుద్ధరించాలని వారు పేర్కొన్నారు.