ఉన్న ఆదాయాన్ని కాపాడలేకపోతున్న జగన్ గారు కొత్త ప్రతిపాదన చేశారు: నారా లోకేశ్ విమర్శలు

07-01-2020 Tue 12:02
  • 3 రాజధానులు అంటూ మూడు ముక్కలాట మొదలు పెట్టారు
  • అమరావతి అభివృద్ధి గురించి సామాన్యుడికి ఎన్నో విషయాలు తెలుసు
  • జగన్ గారు వేసిన కమిటీలకు తెలియకపోవడం దారుణం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. మూడు రాజధానుల గురించి జగన్ చేసిన ప్రతిపాదనపై ఆయన మండిపడ్డారు. సామాన్యుడికి తెలిసిన విషయాలు కూడా జగన్‌కి తెలియట్లేదని అన్నారు.

'ఉన్న ఆదాయాన్ని కాపాడలేని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యడానికి మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట మొదలు పెట్టారు. అమరావతిలో జరిగిన అభివృద్ధి గురించి సామాన్యుడికి తెలిసిన విషయాలు జగన్ గారు వేసిన కమిటీలకు తెలియకపోవడం దారుణం. సేవ్ అమరావతి' అని లోకేశ్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేశారు.