చంద్రబాబులో అప్పటికీ, ఇప్పటికీ ఎలాంటి పరివర్తన రాలేదు: విజయసాయిరెడ్డి

07-01-2020 Tue 11:53
  • బలహీన వర్గాలపై చంద్రబాబుకి ఎప్పుడూ చిన్న చూపే 
  • అగ్రకుల దురహంకారాన్ని ప్రదర్శించాడు
  • ఐఏఎస్ అధికారి విజయకుమార్‌ను దూషించాడు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఐఏఎస్ అధికారి విజయకుమార్‌పై చంద్రబాబు నాయుడు కొన్ని రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు.

'దళితులన్నా, బలహీన వర్గాల వారన్నా చంద్రబాబు నాయుడికి ఎప్పుడూ చిన్న చూపే. ఎస్సీ, ఎస్టీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని గతంలో అగ్రకుల దురహంకారాన్ని ప్రదర్శించాడు. తాజాగా సీనియర్ ఐఏఎస్ అధికారి విజయకుమార్‌ను దూషించడం చూస్తే అప్పటికీ, ఇప్పటికీ ఎలాంటి పరివర్తన రాలేదని తెలుస్తోంది' అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

కాగా, బోస్టన్‌ నివేదికలోని లోపాలను తాను వివరిస్తే ఐఏఎస్‌ అధికారి విజయకుమార్‌ను కించపరిచానంటూ తనపై దుష్ప్రచారం చేశారని చంద్రబాబు నాయుడు నిన్న వివరణ ఇచ్చారు.