సుకుమార్ మూవీలో కొత్త లుక్ తో కనిపించనున్న బన్నీ

07-01-2020 Tue 11:38
  • సుకుమార్ తో తదుపరి సినిమా 
  • స్మగ్లర్ పాత్రలో కనిపించనున్న బన్నీ 
  • త్వరలో సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు 

బన్నీ తాజాగా నటించిన 'అల వైకుంఠపురములో' చిత్రం, సంక్రాంతి కానుకగా ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బన్నీ లైట్ గెడ్డంతో కనిపించనున్నాడు.

ఇక రీసెంట్ గా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ ఓ మాదిరిగా పెరిగిన గెడ్డంతో కనిపించాడు. సుకుమార్ తో చేయనున్న సినిమా కోసమే బన్నీ గెడ్డం పెంచుతున్నట్టు సమాచారం. షూటింగు సమయానికి మరికాస్త గెడ్డం పెంచేసి అదే లుక్ తో ఆయన ఆ సినిమాలో కనిపిస్తాడట.

ఇరవై ఏళ్ల క్రితం చిత్తూరు ప్రాంతానికి చెందిన కుర్రాడిగా, కాస్ట్యూమ్స్ పరంగాను ఆయన కొత్తగా కనిపిస్తాడని చెబుతున్నారు. ఆయన పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉంటాయనీ, కొంతసేపు స్మగ్లర్ గాను కనిపిస్తాడని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో, బన్నీ జోడీగా రష్మిక సందడి చేయనుంది.