విజయవాడ ఎంపీ ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు... నాని గృహనిర్బంధం!

07-01-2020 Tue 11:17
  • అమరావతి రైతుల నిరసన
  • దీక్షకు మద్దతుగా గద్దె రామ్మోహన్ ధర్నా
  • సంఘీభావం తెలిపేందుకు బయలుదేరిన నాని
  • హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

అమరావతి ప్రాంతంలో రైతులు చేపట్టిన నిరసన దీక్షలకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ నేత గద్దె రామ్మోహన్ చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలియజేసేందుకు వెళ్లాలని భావించిన విజయవాడ ఎంపీ కేశినేని నానిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ ఉదయం నాని బయలుదేరనున్నారన్న విషయాన్ని తెలుసుకున్న పటమట పోలీసులు, ఆయన ఇంటిని చుట్టుముట్టారు.

నాని బయటకు వెళ్లేందుకు వీలు లేదని స్పష్టం చేసిన పోలీసు అధికారులు, ఆయన్ను హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగిన కేశినేని నాని, పోలీసుల సాయంతో, ప్రభుత్వం తనను అక్రమంగా నిర్బంధించిందని ఆరోపించారు. ప్రజల నిరసనలను తొక్కేస్తున్నారని మండిపడ్డారు.