అమరావతిపై జగన్‌కు ఉన్న కోపం ఆ ఒక్క విషయంతో తెలిసిపోయింది: చింతమనేని ప్రభాకర్

07-01-2020 Tue 11:05
  • అమరావతిపై కోపంతోనే ప్రజావేదికను కూల్చారు
  • రాజధానికి ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చారు
  • రియల్ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రైతులు భూములు ఇవ్వలేదు
  • రాజధానికి రూ.లక్ష కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు

రైతులందరూ త్యాగాలు చేసి అమరావతి రాజధానికి ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చారని, అంతేగానీ, రియల్ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రైతులు భూములు ఇవ్వలేదని టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాజధానికి రూ.లక్ష కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రజావేదికను కూల్చడమే అమరావతిపై జగన్‌కు ఉన్న కోపాన్ని తెలిపిందని అన్నారు.

అమరావతి నిర్మాణం చేసి తీరాలని చింతమనేని ప్రభాకర్ అన్నారు. రాజధాని తరలించడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకే మూడు రాజధానుల అంశాన్ని వైసీపీ తెరపైకి తెచ్చిందని చెప్పారు. కమిటీలన్నీ జగన్‌ రాసిచ్చిన స్క్రిప్టులే చదువుతున్నాయని విమర్శించారు.