ఎన్నికలంటే ప్రతిపక్షాలకు భయం: మంత్రి ఈటల

07-01-2020 Tue 10:53
  • ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్, బీజేపీ నేతలు కనపడతారు
  • మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుంది
  • కౌన్సిలర్ల ఎన్నిక తర్వాతే మునిసిపల్ ఛైర్మన్ల ఎంపిక ప్రక్రియ ఉంటుంది
  • ప్రజలను ఓట్లు అడిగే హక్కు టీఆర్ఎస్‌కు మాత్రమే ఉంది

ఎన్నికలంటే ప్రతిపక్షాలకు భయమని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో హుజూర్ నగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్, బీజేపీ నేతలు కనపడతారని అన్నారు. మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కౌన్సిలర్ల ఎన్నిక తర్వాతే మునిసిపల్ ఛైర్మన్ల ఎంపిక ప్రక్రియ ఉంటుందని ఈటల రాజేందర్ తెలిపారు. అభ్యర్థులకు బీ-ఫారాలు ఇవ్వడంలో జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రజలను ఓట్లు అడిగే హక్కు టీఆర్ఎస్‌కు మాత్రమే ఉందని, తాము ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పుకొచ్చారు.