తిరుమలలో నాకు ఎటువంటి అవమానమూ జరగలేదు: హరీశ్ రావు వివరణ

07-01-2020 Tue 10:46
  • వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు వెళ్లిన హరీశ్ రావు
  • అవమానం జరిగిందని వార్తలు
  • అటువంటిదేమీ లేదన్న తెలంగాణ మంత్రి

నిన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు వెళ్లిన తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ఘన స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, మరో మంత్రి హరీశ్ రావును పట్టించుకోలేదని, ఆయనకు సరైన గౌరవాన్ని ఇవ్వలేదని వచ్చిన వార్తలను హరీశ్ ఖండించారు. తనకు ఎటువంటి అవమానమూ జరగలేదని స్పష్టం చేశారు.

తాను వస్తున్నట్టు అక్కడి అధికారులకు ముందస్తు సమాచారం లేదని, అందువల్ల కొంత ఇబ్బంది కలిగిందే తప్ప, తనకు దర్శనం బాగా జరిగిందని వివరణ ఇచ్చారు. కాగా, వీఐపీలను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి దర్శనానికి అనుమతించిన టీటీడీ, కేటీఆర్ ను పుష్కరిణి వైపు నుంచి బయో మెట్రిక్ నమోదు కేంద్రం మీదుగా ఆలయంలోకి పంపించారు. కేటీఆర్ ను ఆ మార్గం నుంచి ఎందుకు అనుమతించారన్న విషయంలో అధికారుల నుంచి స్పష్టత రావాల్సివుంది.