అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఫోన్ చేసిన భారత ప్రధాని మోదీ

07-01-2020 Tue 10:31
  • పలు అంశాలపై చర్చ
  • ఇరు దేశాల మ‌ధ్య బంధం మ‌రింత బలపడిందన్న మోదీ 
  • ట్రంప్‌కు నూతన సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు  

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్‌లో పలు అంశాలపై మాట్లాడారని పీఎంవో తెలిపింది. అమెరికా, భారత్ మ‌ధ్య బంధం మ‌రింత బలపడినట్లు మోదీ చెప్పారు. ట్రంప్‌తో పాటు ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌కు, అమెరికా ప్ర‌జ‌ల‌కు మోదీ నూతన సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు. వారు ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నట్లు మోదీ చెప్పారు.

ఇక పలు అంశాల్లో క‌లిసి ప‌నిచేసేందుకు ట్రంప్, మోదీ సానుకూలంగా స్పందించారు. ఇరు దేశాల మ‌ధ్య బంధం బ‌ల‌ప‌డుతోందని మోదీ వ్యాఖ్యానించారు. కాగా, ట్రంప్ కూడా ఈ సందర్భంగా భార‌త ప్ర‌జ‌ల‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. భార‌త్ పలు రంగాల్లో సాధిస్తున్న అభివృద్ధి ప‌ట్ల ట్రంప్ హర్షం వ్య‌క్తం చేశారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల‌ను మ‌రింత బ‌లోపేతం చేసేందుకు తాము సిద్ధమని ట్రంప్ అన్నారు.