Motor Vehicle Act: వాహన జరిమానాలు తగ్గించ వద్దు: కేంద్రం ఆదేశాలు

  • కేంద్రం సూచించిన జరిమానాలనే విధించాలి
  • రాష్ట్రపతి ఆమోదం లేకుండా తగ్గించవద్దు
  • చట్టాన్ని పాటించాలని సూచించిన కేంద్రం

నూతన వాహనాల చట్టం ప్రకారం, వాహన నిబంధనలను ఉల్లంఘించిన వారిపై , కేంద్రం సూచించిన జరిమానాలనే విధించాలని అన్ని రాష్ట్రాలకూ మోదీ సర్కారు సూచించింది. మోటారు వాహన సవరణ చట్టం - 2019పై రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో, కేంద్రం చెప్పిన జరిమానాల కంటే, తక్కువ జరిమానాలు విధించరాదని రాష్ట్రాలకు సూచనలు విడుదల అయ్యాయి.

రాష్ట్రపతి అనుమతి తీసుకున్న తరువాత మాత్రమే జరిమానాలపై రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. చట్టంలో పేర్కొన్న జరిమానాలనే విధించాలని, తక్కువ విధించవద్దని పేర్కొంది. గుజరాత్, ఉత్తరాఖండ్, మణిపూర్, కర్ణాటక రాష్ట్రాలు పలు ట్రాఫిక్ ఉల్లంఘనులపై జరిమానాలను తగ్గించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన కేంద్రం తాజా వివరణ ఇచ్చింది.

More Telugu News