Bhanumathi: భానుమతి అలా ప్రేమలో పడిందట

  • భానుమతికి మంచి క్రేజ్ 
  • రామకృష్ణ అసిస్టెంట్ డైరెక్టర్ 
  • భానుమతిని ఆకర్షించిన రామకృష్ణ మంచితనం 

తెలుగు తెరపై అగ్రకథానాయికగా ఒక వెలుగు వెలిగిన భానుమతి, రామకృష్ణతో ప్రేమలోపడిన తీరును గురించి సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ ప్రస్తావించారు. "భానుమతి గారు 'కృష్ణ ప్రేమ' సినిమా చేస్తున్నప్పుడు, ఆ సినిమాకి రామకృష్ణ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసేవారు. తన పని తాను చేసుకుపోయే రామకృష్ణగారిని అంతా బుద్ధిమంతుడు అని చెప్పుకునేవారు. దాంతో సహజంగానే భానుమతికి ఆయన పట్ల ఇష్టం ఏర్పడింది.

దాంతో ఓ రోజున నేరుగా ఆయన రూముకు వెళ్లిపోయి, తన మనసులోని ప్రేమను వ్యక్తం చేశారు. రామకృష్ణ తన స్థాయిని గుర్తుకు చేసినా ఆమె తన మనసు మార్చుకోలేదు. వాళ్ల పెళ్లికి తండ్రి నిరాకరించినా ఆమె పట్టించుకోలేదు. సన్నిహితుల సహకారంతో ఆమె పెళ్లి ఓ గుళ్లో జరిగింది. ఆ తరువాత భానుమతిగారికి పుట్టింటివారు కట్నకానుకలు ఇవ్వబోయినా, రామకృష్ణగారు నిరాకరించడం ఆయన గొప్పమనసుకు నిదర్శనం" అని చెప్పుకొచ్చారు.

More Telugu News