BP: రక్తపోటుకు ఇలా చెక్ చెప్పొచ్చట!

  • లింగన్‌బెర్రీ పండ్ల రసంతో బీపీ నియంత్రణ
  • ఎలుకలపై జరిపిన పరిశోధనలో వెల్లడి
  • హెల్సింకీ వర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి

ఇటీవల చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో రక్తపోటు ఒకటి. దీనికి చెక్ పెట్టేందుకు జరిగిన పరిశోధనలు విజయవంతమయ్యాయి. లింగిన్‌బెర్రీ పండ్లు బీపీని నియంత్రించడంలో చక్కని పాత్ర పోషిస్తాయని ఫిన్‌లాండ్‌లోని హెల్సింకీ వర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో తేలింది.

 ఈ పండ్ల రసాన్ని దీర్ఘకాలంపాటు తాగడం వల్ల రక్తపోటు అదుపులోకి వస్తుందని తేలింది. ఎలుకలపై జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఈ పండ్లలో సమృద్ధిగా ఉండే పాలీఫినోల్స్ రసాయనాలు హృద్రోగాన్ని, హై బీపీని అరికట్టగలవని పరిశోధనకారులు తెలిపారు. బీపీ నియంత్రణకు రెనిన్‌ యాంజియోటెన్సిన్‌ హార్మోన్‌ వ్యవస్థ ఎంతో కీలకమైనదని, దానిపై  పాలీఫినోల్స్‌లు చూపే ప్రభావం కారణంగా రక్తపోటు అదుపులోకి వస్తుందని హెల్సింకీ వర్సిటీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

More Telugu News