Amaravati: అమరావతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జేసీ

  • ఉంటే అమరావతిని ఉండనివ్వండి
  • నెల్లూరు, ప్రకాశం జిల్లాలను రాయలసీమలో కలిపి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి
  • లేదంటే కర్నూలు జిల్లాను తెలంగాణలో కలిపేయండి

ఏపీకి మూడు రాజధానుల అంశంపై మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి మరోమారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లాలోని యాడికిలో నిన్న జేసీ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటే అమరావతి ఉండాలని, లేదంటే నెల్లూరు, ప్రకాశం జిల్లాలను రాయలసీమలో కలిపి కొత్తగా గ్రేటర్ రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలా కుదరని పక్షంలో కర్నూలు జిల్లాను తెలంగాణలో కలిపేయాలని సూచించారు. అయినా, ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. అమరావతి నుంచి రాజధానిని తరలించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More Telugu News