Harish Rao: తిరుమలలో తెలంగాణ మంత్రి హరీశ్ రావుకు అవమానం!

  • స్వామి దర్శనానికి వచ్చిన హరీశ్ రావు
  • ప్రొటోకాల్ కల్పించడంలో అధికారులు విఫలం
  • కల్పించుకుని దర్శనం చేయించిన టీటీడీ సభ్యుడు దామోదర్

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన తెలంగాణ మంత్రి హరీశ్ రావుకు తిరుమలలో అవమానం ఎదురైంది. ఓ రాష్ట్ర మంత్రిగా ఆయనకు లభించాల్సిన టీటీడీ ప్రొటోకాల్ ను కల్పించడంలో అధికారులు విఫలం అయ్యారు. అధికారుల తీరుతో మనస్తాపానికి గురైన హరీశ్ రావు స్వామి దర్శనానికి వెళ్లేందుకు నిరాకరించారు.

విషయం తెలుసుకున్న టీటీడీ పాలకమండలి సభ్యుడు దామోదర్, హరీశ్ రావుకు సర్దిచెప్పారు. రద్దీ, వీఐపీల తాకిడి అధికంగా ఉండటంతో పాటు, హరీశ్ రాకపై పూర్తి సమాచారం లేనందునే అలా జరిగిందని వివరణ ఇచ్చారు. ఆపై హరీశ్ రావును దగ్గరుండి స్వామి దర్శనానికి తీసుకెళ్లారు.

అంతకుముందు తెల్లవారుజామున పలువురు ప్రముఖులు స్వామిని వైకుంఠ ద్వారం నుంచి దర్శించుకున్నారు. ఈ తెల్లవారుజామున 2 గంటల సమయంలో ధనుర్మాస కైంకర్యాల అనంతరం వైకుంఠ ద్వారాలు తెరచుకోగా, 5 గంటల నుంచి సామాన్య భక్తులకు స్వామి దర్శనాన్ని కల్పిస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు.

More Telugu News