CAA: అమ్మాయినని, నెట్‌ఫ్లిక్స్ ఉచితమని ప్రచారం చేస్తున్నారు: సీఏఏ నంబరు ట్రోల్స్‌పై బీజేపీ మండిపాటు

  • సీఏఏకు మద్దతుగా నిలవాలంటూ ఫోన్ నంబరు విడుదల చేసిన కేంద్రం
  • మిస్ కాల్ ఇస్తే నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితమంటూ ట్రోల్స్
  • తీవ్రంగా ఖండించిన బీజేపీ

పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) మద్దుతుగా నిలవాలంటూ కేంద్రం ఇటీవల విడుదల చేసిన నంబరుపై వస్తున్న ట్రోల్స్‌ అన్నీ ఇన్నీ కావు. సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్న ఈ నంబరు ట్రోల్స్‌పై  బీజేపీ స్పందించింది. సీఏఏపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తాము నంబరు ప్రకటిస్తే.. ప్రతిపక్షాలు దానిపై తప్పుడు పోస్టులు సృష్టించి గందరగోళానికి గురిచేస్తున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాము విడుదల చేసిన నంబరును కొందరు ఒంటరి అమ్మాయినని, నెట్‌ఫ్లిక్స్ ఉచితమని రకరకాలుగా ఉపయోగిస్తున్నారని అన్నారు. ఇదంతా ప్రతిపక్షాల పనేనని ఆరోపించారు. దశాబ్దాలుగా ఉన్న సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయన్నారు. ఇలాంటి పోస్టులతో ప్రజలను గందరగోళానికి గురిచేయడం తగదని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా హితవు పలికారు. మరోవైపు, ఢిల్లీలో ఆదివారం నిర్వహించిన బూత్ కార్యకర్తల సమావేశంలో కేంద్రమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. తాము విడుదల చేసిన నంబరు పార్టీదని, నెట్‌ఫ్లిక్స్‌ది కాదని స్పష్టం చేశారు.

More Telugu News