టీమిండియా, శ్రీలంక టీ20 మ్యాచ్ రద్దు

05-01-2020 Sun 23:18
  • గౌహతి వేదికగా మ్యాచ్
  • వరుణుడి అంతరాయం
  • ఎల్లుండి రెండో టీ20

టీమిండియా, శ్రీలంక మధ్య గౌహతిలో జరగాల్సిన మొదటి టీ20 మ్యాచ్ రద్దయింది. ఈ మ్యాచ్ కు టాస్ వేసినా వర్షం కారణంగా ఆట సాధ్యం కాలేదు. దాంతో ఒక్క బంతి పడకుండానే మ్యాచ్ ను రద్దు చేశారు. ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మ్యాచ్ కు ముందు మొదలైన వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యపడలేదు. ఇరు జట్ల మధ్య రెండో టీ20  మ్యాచ్ ఎల్లుండి ఇండోర్ లో జరగనుంది.