Asaduddin Owaisi: ఒవైసీ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగిస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదు: జీవీఎల్

  • సీఏఏ, ఎన్నార్సీలను వ్యతిరేకిస్తున్న అసదుద్దీన్ ఒవైసీ
  • స్పందించిన జీవీఎల్
  • స్టాలిన్ పైనా వ్యాఖ్య

ఎన్నార్సీ, సీఏఏ వంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు మైనారిటీ వర్గాలు, పార్టీల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. వీటిని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. అసదుద్దీన్ ఒవైసీ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగిస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. అంతేకాకుండా డీఎంకే నేత స్టాలిన్ పైనా వ్యాఖ్యలు చేశారు. డీఎంకే నేత స్టాలిన్ ఎంఐఎం కార్యకర్తలా పనిచేస్తున్నారని మండిపడ్డారు.

కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా కేరళ సీఎం జీవో తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఏపీ సీఎం జగన్ ఎన్నార్సీని మాత్రమే తప్పుబట్టారని, సీఏఏను వ్యతిరేకించలేదని తెలిపారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించి ఎన్నార్సీ తీసుకువస్తామని చెప్పారు. చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News