Amaravati: చేయని తప్పుకు రాజధాని రైతులను ప్రభుత్వం శిక్షిస్తోంది!: సీపీఎం నేత మధు డిమాండ్

  • మూడు రాజధానులకు తమ పార్టీ వ్యతిరేకం
  • అసెంబ్లీ, సచివాలయం వేర్వేరు చోట్లంటూ గందరగోళం
  • రైతులతో సీఎం వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలి

రాజధాని రైతులతో సీఎం జగన్ వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఎం నేత మధు డిమాండ్ చేశారు. మందడంలో రైతుల ఆందోళనకు సీపీఎం నేతలు మద్దతు తెలుపుతూ వారిని కలిశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ, మూడు రాజధానులకు తమ పార్టీ వ్యతిరేకమని చెప్పారు. టీడీపీ హయాంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ ప్రభుత్వం.. అలా జరిగితే కనుక కేసులు పెట్టాలని అన్నారు. చేయని తప్పుకు రాజధాని రైతులను ప్రభుత్వం శిక్షిస్తోందని మండిపడ్డారు.

రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేయాలని రైతులేమీ అడగలేదని, ప్రభుత్వమే వారిని ఒప్పించిందని గుర్తుచేశారు. అసెంబ్లీ, సచివాలయం వేర్వేరు చోట్ల ఏర్పాటు చేస్తామంటూ గందరగోళం సృష్టిస్తున్నారని, రాష్ట్ర భవిష్యత్ కు ఇది మంచిది కాదని చెప్పారు.

More Telugu News