BJP: సీఏఏకు మతం రంగు పులమాలని ఎంఐఎం యత్నం : బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్

  • నిన్న హైదరాబాద్లో ఎంఐఎం సభలో ఇదే కనిపించింది 
  • ముస్లిం మహిళ హైదరాబాద్ వస్తే చెప్పులతో కొట్టారు 
  • పాకిస్థాన్లో ఇస్లాం రాజ్యాంగం కొనసాగవచ్చా

కేంద్రప్రభుత్వం దేశభద్రతను దృష్టిలో పెట్టుకుని అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి మజ్లిస్ పార్టీ మతం రంగు పులిమి రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. నిన్న హైదరాబాద్ లో జరిగిన ఎంఐఎం సభ ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తోందని ధ్వజమెత్తారు. ఈరోజు ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడారు.

పాకిస్థాన్ లో ముస్లిం రాజ్యాంగం కొనసాగి, అక్కడి హిందువులపై దారుణాలు జరుగుతున్నా మనం పట్టించుకోకూడదని, ఇక్కడ మాత్రం ముస్లింలకు అన్ని విధాలా గౌరవం లభిస్తున్నా ప్రతి విషయంలోనూ మతం రంగు పులుముతారని ఆరోపించారు.

ప్రజల్ని రెచ్చగొట్టి ప్రయోజనం పొందాలని ఎంఐఎం వంటి పార్టీలు ఎదురు చూస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ పరిస్థితుల్లో జాతీయవాద శక్తులన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ కే పరిమితమైన మజ్లిస్ పార్టీ ముందు ఇక్కడి ముస్లింలకు ఏం చేస్తారో చెప్పాలని, లేదంటే అసదుద్దీన్ ఒవైసీకి తగిన బుద్ధి చెబుతామన్నారు.

More Telugu News