Telangana: మునిసిపల్, మేయర్ ఎన్నికల్లో రిజర్వేషన్లు ప్రకటించిన తెలంగాణ!

  • త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికలు
  • 13 కార్పొరేషన్లలో జనరల్ కేటగిరీకి 7
  • బీసీలకు 4, ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి రిజర్వ్

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్‌ మేయర్లు, మునిసిపల్‌ చైర్మన్ల రిజర్వేషన్లను రాష్ట్ర పురపాలక సంచాలకులు శ్రీదేవి ఈ ఉదయం ప్రకటించారు. 13 కార్పొరేషన్లలో ఎస్టీ-1, ఎస్సీ-1, బీసీ-4, జనరల్‌-7 స్థానాలను కేటాయించామని, 123 మునిసిపాలిటీల్లో ఎస్టీ-4, ఎస్సీ-17, బీసీ-40, జనరల్‌ -62 స్థానాలను కేటాయించినట్లు వెల్లడించారు. వివరాలు పరిశీలిస్తే...

ఎస్టీ రిజర్వుడ్ మునిసిపాలిటీల్లో ఆమనగల్, వర్ధన్నపేట, దోర్నాల్, మరిపెడ, డోర్నకల్ ఉండగా, ఎస్సీ రిజర్వుడు మునిసిపాలిటీల్లో కేతనపల్లి, బెల్లంపల్లి, మధిర, పరకాల, వైరా, నస్కురు, అలంపూర్, తోర్రుర్, నార్సింగి, పెద్ద అంబర్ పేట, ఐజా, పెబ్బేరు, నెరుడుచెర్ల, వడ్డేపల్లి, భూపాలపల్లి, తిరుమలగిరి ఉన్నాయి. బీసీలకు రిజర్వ్ అయిన స్థానాల్లో సిరిసిల్ల, నారాయణ పేట, కోరుట్ల, చండూరు, భీంగల్, ఆందోల్, కొల్లాపూర్, యాదగిరిగుట్ట, నిర్మల్,  కిసిగి, రాయికల్, పోచంపల్లి, రమాయపేట, బోధన్, సదాశివ పేట, ఆర్ముర్, మెటపల్లి, గద్వాల్, ఎల్లారెడ్డి, సంగారెడ్డి, వనపర్తి, సుల్తానాబాద్, నర్సంపేట, కిదంగల్, తుఫ్రాన్, ఆలేరు, భువనగిరి ఉన్నాయి.

కార్పొరేషన్ లలో రిజర్వేషన్లను పరిశీలిస్తే, ఎస్టీ వర్గానికి మీర్‌ పేట్, రామగుండంను ఎస్సీలకు, జవహర్ నగర్, వరంగల్, నిజామాబాద్, బండ్లగూడలను బీసీలకు కేటాయించారు. మిగతా ఎన్నికలు జరిగే కార్పొరేషన్లు జనరల్ కేటగిరీలో ఉన్నాయి.

More Telugu News