air India: విషయం తెలుసుకోకుండా విమానంలో ప్రయాణికుల హల్ చల్...నొచ్చుకున్న సిబ్బంది!

  • ఆలస్యంగా వెలుగుచూసిన ఎయిరిండియా ఘటన 
  • సాంకేతిక సమస్యతో విమానాన్ని వెనక్కి మళ్లించిన పైలట్ 
  • కారణం తెలుసుకోకుండా సిబ్బందిపై దౌర్జన్యం

ప్రయాణికుల క్షణికావేశం ఎయిరిండియా సిబ్బందిని నొచ్చుకునేలా చేసింది. అసలేం జరిగిందో తెలుసుకోకుండా ప్రవర్తించిన ప్రయాణికుల తీరు విమర్శలపాలైంది. విమానం గాల్లోకి లేచాక తలెత్తిన సాంకేతిక కారణంతో ప్రయాణికుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పైలట్ విమానాన్ని వెనక్కి తెస్తే, సిబ్బంది పైనే దాడిచేసి ప్రయాణికులు తమ తీరు చాటుకున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి వివరాలివి.

గురువారం ఢిల్లీ నుంచి ఓ ఎయిరిండియా విమానం ముంబయికి బయలుదేరింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ కాసేపటికే మళ్లీ విమానాన్ని ఢిల్లీ ఎయిర్ పోర్టులో దించేశాడు. దీంతో అసహనానికి గురైన ప్రయాణికులు అసలేం జరిగిందో తెలుసుకోకుండా క్యాబిన్ క్రూ సిబ్బంది పై దౌర్జన్యానికి దిగారు.

కాక్ పిట్ డోర్ పగులగొట్టేందుకు ప్రయత్నించారు. ప్రయాణికుల తీరు పై ఎయిరిండియా అధికారి ఒకరు సీరియస్ గా స్పందించారు. 'ప్రయాణికుల తీరు ఏం బాగాలేదు. వారి భద్రత కోసమే పైలట్ విమానాన్ని నిలిపివేశాడు. అంతమాత్రానికే విషయం తెలుసుకోకుండా దౌర్జన్యం చేస్తారా. ఇందుకు బాధ్యులైన ప్రయాణికులపై చర్యలు తప్పవు' అని వ్యాఖ్యానించారు.

More Telugu News