Telugudesam: మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి బెయిల్

  • దాదాపు ఏడు గంటల తర్వాత జేసీకి బెయిల్ మంజూరు
  • మరోమారు పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు
  • నెలకోసారి స్టేషన్ లో సంతకం చేసి వెళ్లాలి: కోర్టు షరతులు

పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి అనంతపురం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఇవాళ లొంగిపోయిన విషయం తెలిసిందే. దాదాపు ఏడు గంటల తర్వాత జేసీకి బెయిల్ లభించింది. షరతులతో  కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. మరోమారు పోలీసులపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని, నెలకోసారి స్టేషన్ లో సంతకం చేసి వెళ్లాలన్న షరతులు విధించింది. అంతకుముందు, జేసీకి బెయిల్ ఇచ్చే విషయమై ఆలస్యం చేస్తున్నారంటూ ఆయన అనుచరుడు ఒకరు పోలీస్ స్టేషన్ ముందు నిలబడి పెట్రోల్ పోసుకున్నాడు. షూరిటీల వెరిఫికేషన్ వల్లే ఆలస్యమైందని పోలీసులు చెబుతున్నారు.

More Telugu News