BJP: తెలంగాణ అప్పుల్లో మునిగిపోయింది: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్

  • రుణ వ్యవధిని ఏకంగా నలబై ఏళ్లకు పెంచారు
  • కొడుకును సీఎం గా చేయాలని కేసీఆర్ కంటున్న కల నెరవేరదు 
  • భవిష్యత్తులో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం అసంభవం

తెలంగాణ ఉద్యమ సమయంలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని నమ్మించిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ఈ రోజు హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం, టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారని ఆరోపించారు.

రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఫణంగా పెట్ట రుణ వ్యవధిని 40 ఏళ్లకు పెంచారని మండిపడ్డారు. నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామని చెప్పిన మాట మర్చి తన కుటుంబానికి మాత్రం పదవులు పంచుతున్నారని విమర్శించారు. తన కొడుకును సీఎంగా చేయాలని కేసీఆర్ కలలు కంటున్నారని.. కానీ అది నెరవేరదన్నారు. భవిష్యత్తులో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం అసంభవమన్నారు. పదవులు లేకుండా కేసీఆర్ కుటుంబం ఒక్క క్షణం కూడా ఉండజాలదని విమర్శించారు.

More Telugu News