హైదరాబాద్ లో ‘మిలియన్ మార్చ్’..ట్యాంక్ బండ్ పై స్తంభించిన ట్రాఫిక్

04-01-2020 Sat 16:04
  • సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీలపై నిరసన
  • ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో మిలియన్ మార్చ్
  • ధర్నా చౌక్ వద్ద నిర్వహించే సభకు తరలివెళ్తున్న ముస్లింలు
జాతీయ పౌర సవరణ చట్టం (సీఏఏ), జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్), జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ) లపై దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ముస్లిం సంఘాలు హైదరాబాద్ లో ఇవాళ ‘మిలియన్ మార్చ్’ నిర్వహిస్తున్నాయి.

ఈ క్రమంలో ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ లో జరిగే సభకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి ముస్లింలు తరలివెళ్తున్నారు. దీంతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ట్యాంక్ బండ్ పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ముస్లిం సంఘాలు మిలియన్ మార్చ్ నిర్వహించేందుకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు.