CPI Narayana: మూడు రాజధానుల ఆలోచన ఏ రకంగా చూసినా సమర్ధనీయం కాదు: సీపీఐ నారాయణ

  • పునర్విభజన జరిగిన తర్వాత మన రాష్ట్రం చిన్నదైపోయింది
  • 13 జిల్లాల కోసం మూడు రాజధానులా?
  • అసెంబ్లీ, సచివాలయంది భార్యాభర్తల సంబంధం వంటిది

ఒకటో, రెండో జిల్లాల మీద సీఎం జగన్ కు కనుక కోపం ఉంటే, రాజధాని మార్చాలన్న ఆలోచన మంచిది కాదని, తన కోపాన్ని ఈ రకంగా ప్రదర్శించవద్దని సీపీఐ నారాయణ విమర్శించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఏ రకంగా చూసినా సమర్ధనీయం కాదని విమర్శించారు.

'జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్ వ్యవస్థ. కానీ, అసెంబ్లీ, సచివాలయం వేర్వేరు ప్రాంతాల్లో ఉండటం కరెక్టు కాదు. ఆ రెండింటిది భార్యాభర్తల సంబంధం లాంటిదని అన్నారు. రాష్ట్ర పునర్విభజన జరిగిన తర్వాత మన రాష్ట్రం చిన్నదైపోయిందని, ఈ 13 జిల్లాల కోసం మూడు రాజధానులు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

More Telugu News