Rohit Sharma: రోహిత్ శర్మ పేరుతో హైదరాబాదు సమీపంలో క్రికెట్ స్టేడియం

  • హైదరాబాద్ శివార్లలో నిర్మాణం
  • శ్రీ రామచంద్ర మిషన్ ఆశ్రమంలో స్టేడియం
  • సతీసమేతంగా విచ్చేసిన రోహిత్ శర్మ

భారత క్రికెట్ చరిత్రలో రోహిత్ శర్మ వంటి ఆటగాడు ఎంతో అరుదుగా మాత్రమే వస్తుంటారు. ఫార్మాట్ ఏదైనా కళాత్మక విధ్వంసం సృష్టించడమే తెలిసిన బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ. కోహ్లీతో పోటాపోటీగా రికార్డులను వేటాడుతున్న ఈ ముంబయి ఆటగాడి పేరుమీద తెలంగాణలో ఓ క్రికెట్ స్టేడియం, అక్కడే ఓ అకాడమీ నిర్మితమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో ఈ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేయగా, రోహిత్ శర్మ సతీసమేతంగా విచ్చేశాడు.

ఇక్కడి కన్హ గ్రామ శివార్లలోని శ్రీ రామచంద్ర మిషన్ ఆశ్రమంలో ఈ క్రికెట్ స్టేడియం నిర్మాణం జరుపుకుంటోంది. నిర్మాణ పనులను రోహిత్ శర్మ స్వయంగా పరిశీలించాడు. దీనిపై రామచంద్ర మిషన్ కు చెందిన కమలేష్ పటేల్ మాట్లాడుతూ, యువతకు స్ఫూర్తినిచ్చే వ్యక్తుల్లో రోహిత్ శర్మ ఒకడని, అందుకే అతని పేరును క్రికెట్ స్టేడియంకు పెట్టామని వివరించారు. తనకు లభించిన గౌరవం పట్ల రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. త్వరలో ఇక్కడికి ఇతర టీమిండియా క్రికెటర్లను కూడా తీసుకువస్తానని తెలిపాడు.

More Telugu News