samata rape case: మాకే పాపం తెలియదు.. కోర్టులో సమత హత్యాచారం కేసు నిందితులు

  • తమపై తప్పుడు అభియోగాలు మోపారని ఆరోపణ
  • చార్జ్‌షీట్ ఆధారంగా రూపొందించిన 52 ప్రశ్నలు అడిగిన న్యాయస్థానం
  • కేసు విచారణ ఆరో తేదీకి వాయిదా

ఆదిలాబాద్‌లో హత్యాచారానికి గురైన సమత కేసులో నిందితులు తమ నేరాన్ని అంగీకరించలేదు. తమపై తప్పుడు అభియోగాలు మోపారని, హత్యాచారానికి పాల్పడింది తాము కాదని కోర్టుకు తెలిపారు. సమత హత్యాచారం కేసును విచారిస్తున్న ప్రత్యేక న్యాయస్థానం ఎదుట నిందితులు హాజరయ్యారు. శుక్రవారం వీరిని గట్టి బందోబస్తు నడుమ కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రత్యేక న్యాయస్థానంలో పోలీసులు హాజరుపరిచారు.

చార్జిషీట్ ఆధారంగా రూపొందించిన 52 ప్రశ్నలను న్యాయస్థానం నిందితులకు సంధించింది. అయితే, తాము నిర్దోషులమని, తమకు, ఈ ఘటనకు ఎటువంటి సంబంధం లేదని నిందితులు షేక్ బాబా, షేక్ షాబుద్దీన్, షేక్ ముఖ్దూంలు న్యాయస్థానానికి తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు ఈ నెల ఆరో తేదీకి కేసు విచారణను వాయిదా వేసింది.

More Telugu News