Tirumala: సాధారణ భక్తుల కోసం ఉత్తరద్వార దర్శనాన్ని పదిరోజుల పాటు కొనసాగించండి: టీటీడీకి హైకోర్టు సూచన

  • ఓ పిటిషనర్ పిటిషన్ పై హైకోర్టు విచారణ
  • ఈ నెల 6లోపు తుది నిర్ణయం తీసుకోవాలి
  • టీటీడీ తీసుకునే తుది నిర్ణయంపై జోక్యం చేసుకోం: హైకోర్టు

సాధారణ భక్తుల కోసం తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనాన్ని పదిరోజుల పాటు కొనసాగించాలని తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) ఏపీ హైకోర్టు సూచించింది. ఉత్తరద్వార దర్శనం పదిరోజుల పాటు సాగించాలని కోరుతూ ఓ పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం విచారణ జరిపింది. సాధారణ భక్తుల కోసం ఉత్తరద్వార దర్శనం పొడిగించాలన్న పిటిషనర్ వ్యాఖ్యలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. టీటీడీ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసుకుని, ఈ నెల 6వ తేదీలోపు తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అయితే, టీటీడీ తీసుకునే తుది నిర్ణయంపై మాత్రం హైకోర్టు జోక్యం చేసుకోదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, ఈ ఆదేశాల మేరకు టీటీడీ పాలకమండలి రేపు భేటీ కానుంది.

More Telugu News