‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో.. కొత్త ఎపిసోడ్.. ఎలుకతో హాస్య సన్నివేశం

03-01-2020 Fri 21:26
  • కొత్తగా ప్లాన్ చేసి చిత్రీకరణ పూర్తి
  • హీరోగా మహేశ్ బాబు.. హీరోయిన్ గా రష్మిక 
  • ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు..

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే.. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు వినోదాన్ని పంచనుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రముఖ టాలీవుడ్ నటి విజయశాంతి శక్తిమంతమైన పాత్ర పోషించారు.

  అనిల్ రావుపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా అద్యంతం వినోదమే ప్రధానంగా కొనసాగుతుంది. తొలి ప్రథమార్థంలో ట్రెయిన్ ఎపిసోడ్ ఉండగా.. ఇది అద్భుతంగా వచ్చిందంటున్నారు. సెకండాఫ్ లో కూడా అదే స్థాయిలో వినోదం కోసం ఎలుక ఎపిసోడ్ ను ప్లాన్ చేసి చిత్రీకరించారని సమాచారం. దీంతో పాటు వెన్నెల కిషోర్, సుబ్బరాజు కామెడీ ట్రాక్ కూడా ప్రేక్షకులను అలరించనుంది.