BCG Committee: హైదరాబాద్ కు ప్రత్యామ్నాయంగా కర్నూలును అభివృద్ధి చేయాలి: బీసీజీ నివేదిక

  • బెంగళూరుకు ప్రత్యామ్నాయంగా అనంతపురం   
  • కృష్ణా డెల్టాలో ఎడ్యుకేషన్ హబ్  
  • ఉత్తరాంధ్ర రీజియన్ లో మెడికల్ హబ్

హైదరాబాద్ కు ప్రత్యామ్నాయంగా కర్నూలును అభివృద్ధి చేయాలని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నివేదికలో అభిప్రాయపడింది. బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాల గురించి ఏపీ ప్రణాళికా కార్యదర్శి విజయ్ కుమార్ వివరించి చెప్పారు. ఈ సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బెంగళూరుకు ప్రత్యామ్నాయంగా అనంతపురంను అభివృద్ధి చేయాలని, రాష్ట్రంలో కొత్తగా ఐదు ఎక్స్ ప్రెస్ వేలను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది.

కృష్ణా డెల్టాలో సిరమిక్స్, ఫిషరీస్, ఎడ్యుకేషన్ హబ్, మచిలీపట్నం పోర్టును పూర్తి స్థాయిలో ఇన్ ఫ్రా రంగానికి కేటాయించాలని, ఉత్తరాంధ్ర రీజియన్ లో మెడికల్ హబ్, టూరిజం, దక్షిణాంధ్రలో ఆటోమోటివ్, లెదర్, పేపర్, ఫిషరీస్ ఇండస్ట్రీలు రావాలని, మైపాడ్ బీచ్ ను అభివృద్ధి చేయాలని అభిప్రాయపడింది.

వెస్ట్ రాయలసీమ గోదావరి- పెన్నా అనుసంధానం, హైవే కనెక్టివిటీ ఉండాలని, ఈస్ట్ రాయలసీమలో ఎలక్ట్రానిక్స్, మాన్యుఫాక్చరింగ్, స్టీల్ ప్లాంట్లు, హైటెక్ అగ్రికల్చర్ టొమాటో (ప్రాసెసింగ్), గండికోట, బేలం, గుహల మధ్య ఎకో ఎడ్వంచర్ సర్క్యూట్, రాయలసీమ జిల్లాల్లో కోల్డ్ స్టోరేజ్ ల సంఖ్య పెరగాలని సూచించింది.

రాష్ట్రంలోని తాగు, సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు పెడితే ప్రయోజనం ఉంటుందని, అందుకోసం, లక్షా 76 వేల కోట్లు ఖర్చవుతుందని నివేదికలో చెప్పినట్టు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే రూ.33 వేల కోట్లు, డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ కు రూ.48 వేల కోట్లు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి రూ.16 వేల కోట్ల ఖర్చవుతుందని బీసీజీ నివేదికలో సూచించినట్టు విజయ్ కుమార్ తెలిపారు.

More Telugu News