Vijayawada: రాష్ట్రంలో 7 జిల్లాలు వెనుకబడి వున్నాయి: బీసీజీ నివేదిక

  • బోస్టన్ కమిటీ నివేదికలో రాష్ట్రాభివృద్ధికి కొన్ని సూచనలు చేసింది
  • 13 జిల్లాలను 6 ప్రాంతాలుగా విభజించి అధ్యయనం చేసింది
  • ఎయిర్ పోర్టు, పోర్టు విషయంలో విశాఖలో తప్ప ఎక్కడా అంతగా అభివృద్ధి లేదు

ఏపీ ప్రభుత్వానికి తమ నివేదికను సమర్పించామని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) పేర్కొంది. ఈ నివేదికలోని అంశాలను ఏపీ ప్రణాళికా కార్యదర్శి విజయ్ కుమార్ వివరించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బోస్టన్ కమిటీ నివేదికలో రాష్ట్రాభివృద్ధికి కొన్ని సూచనలు చేసిందని,13 జిల్లాలను ఆరు ప్రాంతాలుగా విభజించి అధ్యయనం చేసిందని, ఏ ప్రాంతంలో ఏ వనరులు ఉన్నాయో పరిశీలించిందని చెప్పారు.
 
ఏపీకి రూ.2.2 లక్షల కోట్ల అప్పు ఉందని, రాష్ట్రంలో 7 జిల్లాలు వెనుకబడి ఉన్నాయని, కృష్ణా-గోదావరి బేసిన్ లో మాత్రమే వ్యవసాయ ఉత్పత్తి ఎక్కువగా ఉందని, కేజీ బేసిన్ ద్వారా 50 శాతం అగ్రికల్చర్ ఉత్పత్తి ఉందని, తలసరి ఆదాయంలో కూడా ఏపీ వెనుకబడి ఉందని నివేదికలో వివరించినట్టు చెప్పారు. విశాఖ నుంచి చెన్నై వరకు రోడ్డు కనెక్టివిటీ ఉందని, ఎయిర్ పోర్టు, పోర్టు విషయంలో విశాఖలో తప్ప ఎక్కడా అంతగా అభివృద్ధి లేదని నివేదికలో పేర్కొన్నట్టు విజయ్ కుమార్ తెలిపారు.

More Telugu News