ప్రియా సిస్టర్స్ తో కచేరీ... స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన 'అల... వైకుంఠపురములో' చిత్రబృందం

03-01-2020 Fri 15:36
  • సంక్రాంతి కానుకగా వస్తున్న అల... వైకుంఠపురములో
  • బన్నీ సరసన పూజా హెగ్డే
  • త్రివిక్రమ్ దర్శకత్వం

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించే సినిమాల్లో శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన కీర్తనలు, కృతులు ఉండడం పరిపాటి. తాజాగా ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం అల... వైకుంఠపురములో. ఈ సినిమాలో అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ చిత్రంపై భారీగా అంచనాలున్నాయి.

 తాజాగా, ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా జనవరి 6న హైదరాబాదులోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో సంగీత కచేరీ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో వీడియోను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఇందులో ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసులు ప్రియా సిస్టర్స్ అల... వైకుంఠపురములో అంటూ శ్రావ్యంగా ఆలపించడం చూడొచ్చు.