Andhra Pradesh: కాసేపట్లో బోస్టన్ నివేదిక జగన్ చేతికి... నిర్ణయం తీసుకుంటామన్న హోంమంత్రి సుచరిత

  • బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు నివేదిక సిద్ధం
  • ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు జగన్ వద్దకు నివేదిక
  • క్యాంపు కార్యాలయంలో సీఎంకు అందివ్వనున్న బీసీజీ

రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు( బీసీజీ) నివేదిక సిద్ధమైంది. ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ కు ఆ నివేదికను బీసీజీ ప్రతనిధులు అందజేయనున్నారు. రాజధానిలో సాంకేతిక అంశాలపై బీసీజీ అధ్యయనం చేసింది. మరోపక్క, రాజధానిపై వచ్చిన నివేదికలపై ఈ నెల 6న హైపవర్ కమిటీ భేటీ అవుతుంది. ఈ నెల 8న జరిగే కేబినెట్ లోనూ బీసీజీ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం  చర్చిస్తుంది.

కాగా, గుంటూరులోని ప్రత్తిపాడులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి సుచరిత ఈ సందర్భంగా రాజధానిపై మాట్లాడారు. బీసీజీ ఇచ్చే నివేదికను చూసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాజధానిని పూర్తిగా తరలిస్తామని తాము చెప్పలేదని అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయం, రాజ్ భవన్ లను ఇక్కడే ఏర్పాటు చేస్తామన్నారు. రైతులను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు.

More Telugu News