america: అమెరికా 'రాకెట్ దాడి'పై ఇరాన్ సీరియస్... తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిక.. అత్యవసర భేటీ

  • ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో అమెరికా దాడి
  • దాడిలో ఇరాక్‌కు చెందిన ఉన్నత స్థాయి కమాండర్లు మృతి
  • ఇరాన్ నిఘా విభాగాధిపతి సైతం మృతి  

ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై అమెరికా రాకెట్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఇరాన్‌, ఇరాక్‌కు చెందిన ఉన్నత స్థాయి కమాండర్లు కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో ఇరాన్‌ నిఘా విభాగం ఖడ్స్‌ ఫోర్స్‌ అధిపతి జనరల్‌ ఖాసీం సోలెమన్‌ కూడా ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఇరాన్ సీరియస్ అయింది. తీవ్ర ప్రతీకార దాడి తప్పదని సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖొమైనీ హెచ్చరించారు. ఖాసీం మృతి నేపథ్యంలో మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు.

ఇరాన్‌ విదేశాంగ మంత్రి జావద్‌ ఝరీఫ్‌ మీడియాతో మాట్లాడుతూ... అమెరికా జరిపిన దాడి అతి భయంకరమైన, ఉద్రిక్తతలను పెంచే అవివేకపు చర్య అని అన్నారు. తదనంతర తీవ్ర పరిణామాలకు అమెరికాయే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. అమెరికా చర్య అంతర్జాతీయ ఉగ్రవాదం అని అన్నారు. బాగ్దాద్ పై దాడి నేపథ్యంలో ఇరాన్‌ అత్యున్నత భద్రతా విభాగం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది.

More Telugu News