Chiranjeevi: చిరూ సరసన ఛాన్స్ వదులుకున్న రెజీనా

  • హీరోయిన్ గా రెజీనాకి మంచి క్రేజ్
  • తెలుగులో తగ్గిన అవకాశాలు 
  • తమిళంలో వరుస సినిమాలు 

తెలుగులో రెజీనా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకోవడానికి ఇబ్బందులు పడుతూనే వుంది. ఇటీవల ఆమె చేసిన 'ఎవరు' సినిమా ఆమెకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఆమెకి చిరంజీవి సినిమా నుంచి ఒక ఆఫర్ వెళ్లిందట. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా 'త్రిష'ను తీసుకున్నారు.

ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉందట. ఈ సాంగ్ కోసం రెజీనాను తీసుకోవాలనే ఉద్దేశంతో ఆమెను సంప్రదించగా, చేయలేనని చెప్పిందట. చిరూతో కలిసి చిన్న స్టెప్ వేసినా చాలనుకునే కథానాయికలు చాలామందే వున్నారు. రెజీనా కూడా అలాంటి కథానాయికే. అయితే ప్రస్తుతం ఆమె తమిళంలో 6 సినిమాలు చేస్తోంది. వాటిలో 4 సినిమాలు సెట్స్ పై వున్నాయి. డేట్స్ ఖాళీగా లేకపోవడం వల్లనే రెజీనా ఈ ఛాన్స్ వదులుకున్నట్టు తెలుస్తోంది.

More Telugu News