Venkatesh: అందుకే 'అసురన్' విషయంలో శ్రియను పక్కనపెట్టారట

  • 'అసురన్' రీమేక్ కి సన్నాహాలు 
  • శ్రియ స్థానంలో ప్రియమణి 
  • ఈ నెల 22 నుంచి షూటింగుకి ప్రియమణి 

ధనుశ్ హీరోగా తమిళంలో చేసిన 'అసురన్' అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో వెంకటేశ్ హీరోగా సురేశ్ ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందించనున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్ సరసన నాయికగా శ్రియను తీసుకోవాలని భావించారు.

అయితే ప్రస్తుతం శ్రియ 'బార్సిలోనా'లో ఉంటోంది. ఆమె పారితోషికంతో పాటు రానుపోను ప్రయాణం ఖర్చులు కూడా ఎక్కువే. ఈ సినిమాను తక్కువ బడ్జెట్ లోనే ప్లాన్ చేసిన సురేశ్ బాబు, శ్రియకి బదులుగా ప్రియమణిని ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు. ప్రియమణి డేట్స్ ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉండటం కూడా ఒక కారణమని అంటున్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి వెంకటేశ్ - ప్రియమణిలపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తారని చెబుతున్నారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

More Telugu News