Priya Mani: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

  • వెంకటేశ్ సినిమాలో ప్రియమణి 
  • 14 కోట్లకు 'దర్బార్' హక్కులు 
  • మరో సినిమాకి సూర్య గ్రీన్ సిగ్నల్

 *  తమిళంలో హిట్టయిన 'అసురన్' చిత్రాన్ని తెలుగులో వెంకటేశ్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించే ఈ చిత్రంలో కథానాయికగా ప్రియమణిని ఎంపిక చేసినట్టు తాజా సమాచారం.
 *  సూపర్ స్టార్ రజనీకాంత్, మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందిన 'దర్బార్' చిత్రాన్ని ఈ నెల 9న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. కాగా, ఈ చిత్రం తెలుగు వెర్షన్ థియేట్రికల్ హక్కులు 14 కోట్లకు అమ్ముడైనట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.  
*  ఏమాత్రం గ్యాప్ లేకుండా ఒకదాని తర్వాత ఒకటిగా సినిమాలు చేస్తూ వస్తున్న తమిళ హీరో సూర్య తాజాగా మరో చిత్రాన్ని అంగీకరించాడు. ప్రముఖ దర్శకుడు వెట్రి మారన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.  

More Telugu News