Australia: ఇళ్లు కోల్పోయి ప్రజలు ఏడుస్తుంటే.. తీరిగ్గా క్రికెట్ చూడమన్న ఆస్ట్రేలియా ప్రధాని!

  • ఆస్ట్రేలియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు
  • ఇప్పటి వరకు 18 మంది మృతి
  • క్రికెట్ జట్టును కలిసి ముచ్చటించిన ప్రధాని స్కాట్ మారిసన్

ఆస్ట్రేలియాను కార్చిచ్చు దహించి వేస్తుంటే ప్రధాని స్కాట్ మారిసన్ ఆసీస్ జట్టుతో సమావేశం కావడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దావానలం కారణంగా ఇప్పటి వరకు 18 మంది మృతి చెందారు. ఇలాంటి సమయంలో క్రికెట్ జట్టును కలిసిన ప్రధాని వారితో ముచ్చటించారు. నేటి నుంచి ఆసీస్-న్యూజిలాండ్‌ల మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో క్రికెటర్ల ఆటను చూసి ప్రజలు ప్రేరణ పొందాలని పిలుపునిచ్చారు.

ఓవైపు కార్చిచ్చు తమను దహించి వేస్తూ ఇళ్లూ, ఊళ్లూ మాయం చేస్తుంటే క్రికెట్ చూడాలని చెప్పడం ఏంటంటూ ప్రజలు మండిపడుతున్నారు. ప్రధాని మారిసన్ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఇళ్లు కోల్పోయి, తినడానికి తిండి లేకుండా అగచాట్లు పడుతుంటే పట్టించుకోని ప్రధాని, క్రికెట్ చూడమని చెప్పడమేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

More Telugu News