MAA: చిరంజీవి జోక్యం చేసుకున్నారు.. సమస్య పరిష్కారమవుతుంది: తమ్మారెడ్డి భరద్వాజ

  • నేటి సమావేశంలో చిరంజీవిలో సగం కోపమే చూశాం !
  • రాజశేఖర్ తన ఆవేశాన్ని ఆపుకోలేకపోయారు
  • ఆధిపత్య పోరులో భాగంగా ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయి

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సమావేశంలో జరిగిన రాద్ధాంతంపై నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి ఇందులో జోక్యం చేసుకున్నారు..కాబట్టి సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజశేఖర్ తన ఆవేశాన్ని ఆపుకోలేకపోయారన్నారు. ఆధిపత్య పోరులో భాగంగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు.

గతంలో కూడా ఇలాంటి సమస్యలు వచ్చాయని, ప్రస్తుతం మీడియా సమక్షంలో ఈ రభస జరిగిందని, క్రమ శిక్షణ కమిటీ గతంలో చాలాసార్లు చాలామందిపై చర్యలు తీసుకుందని అన్నారు. అవన్నీ అంతర్గతంగా సాగిపోయాయని, బహిర్గతం కాలేదని అన్నారు. ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉండటానికి చిరంజీవి కృషిచేస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

‘నేటి సమావేశంలో చిరంజీవిలో సగం కోపమే చూశాం. ఆయనకు పూర్తి కోపం వస్తే సమస్యలు పరిష్కారమవుతాయి. గతంలో ఇలాంటి సమస్యలు వచ్చాయి. వాటిని సరిదిద్దడానికి దాసరి నారాయణరావు ఉండేవారు. ప్రస్తుతం ఆయనలా బాధ్యతలు నిర్వర్తించేవారు లేరు. చిరంజీవి ఆ స్థానం భర్తీ చేస్తారనిపిస్తోంది’ అని తమ్మారెడ్డి చెప్పారు.

More Telugu News