Telangana: నైతిక విలువలు పెంచేలా విద్యా విదానం ఉండాలి: సీఎం కేసీఆర్

  • నేరాలు తగ్గేలా పాఠ్యాంశాలు మార్పు చేస్తాం
  • ధార్మిక వేత్తలు, మాజీ డీజీపీల సలహాలతో పాఠ్యాంశాల తయారీ
  • మంచిని కాపాడటంకోసం కఠినంగా వ్యవహరించడం తప్పు కాదు  

సమాజంలో నేర ప్రవృత్తిని నిరోధించి నైతిక విలువలు పెంచేలా విద్యావిధానం ఉండాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇందుకోసం విద్యాసంస్థల్లో, విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించే బోధనలు ప్రారంభిస్తామన్నారు. బోధనాంశాలను రూపొందించడానికి జీయర్ స్వామి లాంటి ధార్మిక వేత్తలు, మాజీ డీజీపీల సలహాలను తీసుకుంటామని సీఎం చెప్పారు. కొన్ని చోట్ల మనుషులు మృగాల్లా మారుతున్నారన్నారు. నేర ప్రవృత్తి ప్రబలకుండా చూడాల్సిన అవసరముందని చెప్పారు.

ప్రగతి భవన్లో మాజీ డీజీపీ హెచ్.జె దొర ఆటోబయోగ్రఫీ ‘జర్నీ త్రూ టర్బులెంట్ టైమ్స్’ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణను ఆదర్శవంతమైన సమాజంగా తీర్చిదిద్దడానికి పోలీసులు కూడా తవ విలువైన భాగస్వామ్యాన్ని అందించాలని కోరారు.

మంచిని కాపాడటంకోసం కఠినంగా వ్యవహరించడం తప్పు కాదని తెలిపారు. ప్రజాస్వామ్యంలో కొన్ని పనులు ఇష్టం లేకున్నా చేయాల్సి వస్తుందన్నారు. సమాజానికి మంచి జరుగుతుందనుకున్నప్పుడు కొన్ని పనులు కఠినంగా చేయక తప్పదని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణలో పోలీసులు సామాజిక రుగ్మతలు తొలగించేందుకు కృషి చేస్తున్నారన్నారు. కేవలం శాంతి భద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతతో అనేక కర్తవ్యాలు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. 

More Telugu News