BSE: మార్కెట్ల లాభాల జోరు... ఆరంభం నుంచి చివరి వరకు ఒకే ట్రెండ్

  • చైనాతో వాణిజ్య ఒప్పందానికి ట్రంప్ ప్రకటన
  • మార్కెట్లపై సానుకూల ప్రభావం
  • లాభాల బాటలో టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్

భారత స్టాక్ మార్కెట్లు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ దూకుడు ప్రదర్శించాయి. ఆరంభం నుంచి ముగింపు వరకు ఒకే తీరున జోరు ప్రదర్శించాయి. చైనాతో వాణిజ్య ఒప్పందానికి తాము సిద్ధమని, అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో మార్కెట్లలో హుషారు కనిపించింది.

అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, వేదాంత తదితర షేర్లు లాభాలు ఆర్జించగా, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, భారత్ పెట్రోలియం వంటి దిగ్గజాలు నష్టాలు ఎదుర్కొన్నాయి. ఇక, సెన్సెక్స్ 320.62 పాయింట్ల లాభంతో 41,626.64 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 99.70 పాయింట్ల వృద్ధితో 12,282.20 వద్ద ముగిసింది.

More Telugu News