devineni uma: అధికారులూ జాగ్రత్, జగన్ మాట విని సంతకాలు పెడితే... సీబీఐ విచారణ వుంటుంది: దేవినేని ఉమ హెచ్చరిక

  • గతంలో కొందరు ఇలాగే సంతకాలు చేశారు
  • ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నారు
  • పోస్టింగ్‌ కోసం ఐఏఎస్  శ్రీలక్ష్మి ఇప్పటికీ ఢిల్లీలో ప్రయత్నాలు జరుపుతున్నారు

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పినట్లు విన్న అధికారులంతా ఇప్పుడు జైళ్ల చుట్టూ తిరుగుతున్నారని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వర రావు అన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాట విని సంతకాలు పెడుతున్న అధికారులు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. రహస్య జీవోలపై సంతకాలు చేసిన వారిపై భవిష్యత్తులో సీబీఐ విచారణ జరుగుతుందని ఆయన అన్నారు.

వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి పాలనలో జగన్‌, విజయ సాయిరెడ్డిల మాటలు విని, సంతకాలు పెట్టిన అధికారుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో గుర్తు చేసుకోవాలని దేవినేని ఉమ అన్నారు. పోస్టింగ్‌ కోసం ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఇప్పటికీ ఢిల్లీలో కేంద్రమంత్రులు, పార్లమెంటు చుట్టూ తిరుగుతున్నారని ఆయన అన్నారు అధికారులు తొందరపడి జీవోలపై సంతకాలు పెట్టకూడదని సూచించారు. జగన్ తెలివి తక్కువ వాడని, అటువంటి వ్యక్తికి రాష్ట్రాన్ని అప్పగిస్తే ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆయన విమర్శలు గుప్పించారు. రాజధానిపై జగన్ తీరు సరికాదని అన్నారు.

More Telugu News