maa: సినీ పరిశ్రమకు సాయం చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు: చిరంజీవి

  • నూతన సంవత్సరం సందర్భంగా 'మా' డైరీ ఆవిష్కరణ 
  • ఏపీ ప్రభుత్వాన్ని కూడా సాయం చేయాలని అడుగుదామన్న చిరు
  • పేద కళాకారులకు సాయం అందించాలన్న మెగాస్టార్

అందరం ఏకాభిప్రాయంతో ఉంటేనే ప్రభుత్వాన్ని మనమేదైనా అడగొచ్చని సినీ ప్రముఖులకు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ రోజు ఆయన 'మా' డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.... సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎలాంటి సాయమైనా చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని అన్నారు. ఏపీ ప్రభుత్వాన్ని కూడా సాయం చేయాలని అడుగుదామని చెప్పారు. పేద కళాకారులకు సాయం అందించాలని ఆయన అన్నారు.

More Telugu News