Puri Jagannadh: ముంబైకి మకాం మార్చుతున్న పూరి జగన్నాథ్

  • విజయ్ దేవరకొండతో 'ఫైటర్' చిత్రాన్ని నిర్మిస్తున్న పూరి జగన్నాథ్
  • హిందీ వెర్షన్ కు కరణ్ జొహార్ సహకారం
  • ఈ చిత్రం తర్వాత హిందీ సినిమాలు చేయాలని భావిస్తున్న జగన్

చాలా కాలం తర్వాత 'ఇస్మార్ట్ ఇంకర్' సినిమాతో దర్శకుడు పూరి జగన్నాథ్ ఘన విజయం అందుకున్నాడు. తాజాగా విజయ్ దేవరకొండతో 'ఫైటర్' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్తోంది. ఈ చిత్రం హిందీ వెర్షన్ కు బాలీవుడ్ నిర్మాత కరణ్ జొహార్ సహకారం అందిస్తున్నాడు. మరోవైపు, ఈ చిత్రంలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుంచితే, 'ఫైటర్' చిత్రం తర్వాత హిందీలో సినిమాలు చేయాలని పూరి జగన్నాథ్ భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో, ఆయన హైదరాబాద్ నుంచి ముంబైకి మకాం మారుస్తున్నట్టు తెలుస్తోంది.

More Telugu News