Yanamala: ఆ ప్రాంతాల్లో జగన్ ప్యాలెస్ లు కట్టుకున్నారు.. ఇప్పుడు ఇక్కడ కన్ను పడింది: యనమల

  • రేపు విశాఖపట్నం వెళ్తే అక్కడ మరో ప్యాలెస్ కడతారా?
  • విశాఖలో ఎప్పటినుంచో అభివృద్ధి ఉంది
  • మూడు రాజధానులు అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదు
  • హైకోర్టు వేరే చోట ఉండవచ్చు కానీ, మూడు రాజధానులు మంచిదికాదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే కడప, బెంగళూరు, హైదరాబాద్ అన్ని చోట్ల ప్యాలెస్ లు కట్టుకున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. రేపు విశాఖపట్నం వెళ్తే అక్కడ మరో ప్యాలెస్ కడతారా? అని ప్రశ్నించారు. జగన్ కు, ఆయన అనుచరులకు విశాఖపై కన్ను పడిందని అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర సంపద పెంచుకోవాలన్న ఆలోచన జగన్ చేయట్లేదని, తన సంపద, తన అనుచరుల సంపద పెంచుకోవడంపైనే సీఎం ఆలోచిస్తున్నారని అన్నారు.

చెన్నై వల్ల తమిళనాడు స్థిరంగా అభివృద్ధి చెందుతోందని యనమల అన్నారు. విశాఖలో ఎప్పటినుంచో అభివృద్ధి ఉందని అన్నారు. మూడు రాజధానులు అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు. హైకోర్టు వేరే చోట ఉండవచ్చు కానీ, మూడు రాజధానులు మంచిదికాదని తెలిపారు. జగన్ కు, ఆయన అనుచరులకు విశాఖపై కన్ను పడిందని అన్నారు. టీడీపీ పాలనలో భారీగా పెట్టుబడులు తీసుకొచ్చామని అన్నారు.

సంపద సృష్టించడానికి టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లు కృషి చేసిందని యనమల అన్నారు. అమరావతిలో అక్కడ కనీస మౌలిక సదుపాయాలున్నాయని, సంపద పెరిగితే అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో చాలా సమస్యలు ఉన్నాయని చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయని, వీటన్నింటినీ పక్కనపెట్టి వివాదాలు తెరపైకి తెస్తున్నారని యనమల విమర్శించారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదని ఆయన అన్నారు.

More Telugu News