తెలంగాణకు తర్వాతి సీఎం ఎవరో చెప్పేసిన మహబూబాబాద్ ఎంపీ కవిత

02-01-2020 Thu 07:23
  • గ్రీన్ చాలెంజ్‌ను పూర్తి చేసిన మాలోతు కవిత
  • పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బలోపేతం చేస్తున్నారని ప్రశంస
  • కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరేనంటూ జోస్యం
తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరేనని మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత అన్నారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ విసిరిన గ్రీన్ చాలెంజ్‌ను స్వీకరించిన కవిత.. మహబూబాబాద్‌లో మూడు మొక్కలు నాటి సవాలును పూర్తి చేశారు. అనంతరం తన పార్లమెంట్‌ పరిధిలోని నర్సంపేట, డోర్నకల్‌, పినపాక ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, రెడ్యానాయక్‌, రేగ కాంతారావులకు గ్రీన్ చాలెంజ్ విసిరారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ తర్వాతి ముఖ్యమంత్రి కేటీఆరేనని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీని ఆయన మరింత ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. మంత్రిగానూ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరేనని కవిత పునరుద్ఘాటించారు.