హైదరాబాద్ లో ఈఎస్ఐ స్కామ్.. మరో ఇద్దరి అరెస్టు

01-01-2020 Wed 22:00
  • ఓమ్నీ మెడి ఫార్మా ఎండీ బాబ్జి, మరో వ్యక్తి అరెస్టు
  • ఈఎస్ఐ అధికారులతో కుమ్మక్కై అక్రమాలు
  • షెల్ కంపెనీ ఏర్పాటు చేసి టెండర్లు దక్కించుకున్న బాబ్జీ

హైదరాబాద్ లో ఈఎస్ఐ స్కామ్ వ్యవహారంలో మరో ఇద్దరిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. మెడికల్ కిట్ల కొనుగోళ్ల వ్యవహారంలో భారీ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఓమ్నీ మెడి ఫార్మా ఎండీ బాబ్జీతో పాటు వెంకటేశ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.

ఈఎస్ఐ అధికారులతో కలిసి మెడికల్ కిట్లను బాబ్జీ కొనుగోలు చేసి, ఒక్కో మెడికల్ కిట్ ను 400 శాతం అధిక రేట్లకు ఈఎస్ఐ కు సప్లయ్ చేశాడు. ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణి, అధికారిణి పద్మ సహకారంతో బాబ్జీ అక్రమాలకు పాల్పడ్డట్టు ఆరోపణలు. లెజెండ్ ఎంటర్ ప్రైజెస్ అనే షెల్ కంపెనీ ఏర్పాటు చేసి టెండర్లను దక్కించుకున్న బాబ్జీ, దాదాపు రూ.130 కోట్ల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టినట్టు తెలుస్తోంది.