జగన్ ప్రభుత్వం ఎంతో కాలం కొనసాగలేదు: కేఈ కృష్ణమూర్తి జోస్యం

01-01-2020 Wed 20:42
  • సీఎంతో పాటు ముగ్గురు మంత్రులు తప్ప మరెవరూ సంతోషంగా లేరు
  • విశాఖలో రాజధానిని ఏర్పాటు చేస్తారా!
  • రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్నారన్న బాధ ఉంది

ఏపీలో జగన్ ప్రభుత్వం మనుగడ ఎంతో కాలం కొనసాగదని టీడీపీ నేత కేఈ కృష్ణమూర్తి జోస్యం చెప్పారు. ఏపీలో సీఎంతో పాటు ముగ్గురు మంత్రులు తప్ప మరెవరూ సంతోషంగా లేరని విమర్శించారు. విశాఖపట్టణంలో రాజధానిని ఏర్పాటు చేస్తే రాయలసీమ వాసులు తమ పనులు చక్కబెట్టుకునేందుకు అక్కడికి వెళ్లాలా? అని ప్రశ్నించారు. రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్నారన్న బాధ తమలో ఉందని అన్నారు. అమరావతి అభివృద్ధి కోసమే రాజధాని రైతులు నాడు భూములిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. రైతులు చేపడుతున్న ఆందోళనల్లో న్యాయం ఉందని, ప్రభుత్వం స్పందించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.